world bank: మోసాలకు పాల్పడుతున్న 78 భారతీయ కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం!

  • నిషేధం విధించిన ప్రపంచ బ్యాంకు
  • కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు
  • 5 కంపెనీలపై ఆంక్షలతో కూడిన నిబంధనలు

అవినీతి, మోసాలకు పాల్పడుతున్న మొత్తం 78 భారతీయ కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. ఇకపై ఈ కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రపంచ బ్యాంకు వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ 78 కంపెనీలే కాకుండా మరో ఐదు కంపెనీలపై కూడా ఆంక్షలతో కూడిన నిబంధనలు విధించింది. భారత్‌కు చెందిన ఆలివ్‌ హెల్త్‌కేర్‌, జై మోదీ కంపెనీలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వాటిని నిషేధిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.

ఏంజెలిక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌పై నాలుగేళ్ల ఆరు నెలలు నిషేధం విధించింది. ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్లు నిషేధం విధించగా.. భారత్‌లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌పై రెండేళ్లు, ఆర్‌కేడీ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏడాది ఆరు నెలల పాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. వీటితో పాటు తత్వ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాక్లోడ్స్‌ ఫార్మాసిటికల్స్‌ లిమిటెడ్‌పై ఏడాది లోపు నిషేధం విధించారు.


  • Loading...

More Telugu News