Hyderabad: మసాజ్ సెంటర్ లో పట్టుబడ్డ యువతిపై బంజారాహిల్స్ ఎస్ఐ లైంగిక దాడి!
- బుధవారం రాత్రి పట్టుబడ్డ ముగ్గురమ్మాయిలు
- ఒక యువతిని గదిలోకి తీసుకెళ్లిన ఎస్ఐ
- యువతి ఆరోపణలతో ఎస్ఐపై విచారణ
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న 'స్టూడియో మేకర్స్ స్పా' మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఓ మహిళపై బంజారాహిల్స్ కు చెందిన ఓ ఎస్ఐ లైంగిక దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ స్పాలో బుధవారం దాడి చేసి, అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ముగ్గురు యువతులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్పా నిర్వాహకులు సతీష్ నార్త్ ఇండియా నుంచి అమ్మాయిలను పిలిపించి ఈ దందా సాగిస్తున్నారని పోలీసులు నిన్న వెల్లడించారు.
ఇక వీరిని బంజారాహిల్స్ స్టేషన్ కు తీసుకెళ్లిన తరువాత, టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ, యువతిని గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన తరువాత ఆ యువతి ఎస్ఐపై ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై స్పందించిన పశ్చిమ మండలం పోలీస్ అధికారి ఒకరు అదంతా అవాస్తవమని చెప్పడం గమనార్హం.