Chandrababu: మంత్రి గంటాకు చంద్రబాబు భయపడుతున్నారా?: సీపీఐ నేత రామకృష్ణ

  • విశాఖ కుంభకోణంపై సిట్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు?
  • ఈ కుంభకోణంలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు
  • రాఫెల్ కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేయాలి
విశాఖపట్నంలో చోటు చేసుకున్న భూకుంభకోణంపై సిట్ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాఫెల్ కుంభకోణంపై ఈనెల 24న దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
Chandrababu
ramakrishna
Ganta Srinivasa Rao
Telugudesam
cpi
visakhapatnam
land scam

More Telugu News