stock market: పెట్రోల్ ధరల తగ్గింపు ఎఫెక్ట్.. కుప్పకూలిన మార్కెట్లు!
- పెట్రో ధరలను రూ.2.50 మేర తగ్గించిన కేంద్రం
- తీవ్ర ఒత్తిడికి గురైన పెట్రోలియం కంపెనీలు
- 792 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
జనాలకు కొంత ఊరటను కలిగించేందుకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2.50 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఈరోజు ట్రేడింగ్ లో పెట్రోలియం కంపెనీల స్టాకులు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి పతనం కొనసాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 792 పాయింట్లు పతనమై 34,376కు పడిపోయింది. నిఫ్టీ 282 పాయింట్లు కోల్పోయి 10,316కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (5.95), క్వాలిటీ (5.00), ఇన్ఫో ఎడ్జ్ (4.57), వక్రాంగీ (3.64), ఇన్ఫోసిస్ (2.19).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ పెట్రోలియం (25.18), భారత్ పెట్రోలియం (21.11), ఇండియన్ ఆయిల్ (16.19), ఓఎన్జీసీ (15.93), శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (11.34).