Westindees: 181 పరుగులకే చాపచుట్టేసిన విండీస్... ఫాలో ఆన్ ఆడిస్తున్న ఇండియా!
- 48 ఓవర్లలో ఆలౌట్
- 17 పరుగులతో నాటౌట్ గా నిలిచిన బిషో
- మరికాసేపట్లో రెండో ఇన్నింగ్స్ ఆడనున్న వెస్టిండీస్
రాజ్ కోట్ లో జరుగుతున్న తొలిటెస్టులో వెస్టిండీస్ జట్టు 48 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. నిన్న ఆరు వికెట్లను కోల్పోయిన జట్టు, ఈ ఉదయం ఆట ప్రారంభమైన తరువాత గంటన్నర కూడా గడవకుండానే మిగతా నాలుగు వికెట్లనూ చేజార్చుకుని, భారత స్కోరు కన్నా 468 పరుగుల వెనుకబడింది.
విండీస్ బ్యాటింగ్ లో బ్రాడ్ వైట్ 2, పావెల్ 1, హోప్ 10, హెట్ మేయర్ 10, ఆంబ్రిస్ 12, చేజ్ 53, డౌరిచ్ 10, పాల్ 47, ల్యాయిస్ 0, గాబ్రియేల్ 1 పరుగు సాధించగా, బిషో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 18 ఎక్స్ ట్రాలు కలిపి విండీస్ స్కోరు 181 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ కు 4 వికెట్లు దక్కగా, షమీకి 2, ఉమేష్, జడేజా, కుల్ దీప్ లకు తలో వికెట్ లభించాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే, 449 పరుగులు చేయాల్సిన వెస్టిండీస్, ఆ టార్గెట్ ను చేరుకోలేకపోయింది. దీంతో మరికాసేపట్లో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.