Nara Lokesh: ఈసీ ప్రకటనతో వైసీపీ లోపాయికారీ ఒప్పందం బయటపడింది: లోకేశ్

  • ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
  • ఏపీలో ఉప ఎన్నికలు లేవని స్పష్టీకరణ
  • వైసీపీ ఎంపీల డ్రామాలు బయటపడ్డాయన్న లోకేశ్

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈసీ ప్రకటనతో వైసీపీ డ్రామాలు బయటపడ్డాయన్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ, ఏపీలో ఉప ఎన్నికలు నిర్వహించబోవడం లేదని స్పష్టం చేసింది.

దీనిపై లోకేశ్ మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో వైసీపీ లోపాయికారీ ఒప్పందం బయటపడిందని విమర్శించారు. కేంద్రంతో వైసీపీ రాజీపడిందన్న విషయం ఈసీ ప్రకటనతో బయటపడిందన్నారు. ఏపీ ప్రజలకు వైసీపీ ఎంపీలు నామం పెట్టారని విమర్శించారు. కేంద్రం వద్ద ఏపీని తాకట్టు పెట్టాలని జగన్ ప్రయత్నించారని, మొత్తానికి జగన్ కుయుక్తులు ఇలా బయటపడ్డాయని లోకేశ్ అన్నారు. వైసీపీ డ్రామాలకు, కుయుక్తులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News