special trains: దసరా స్పెషల్: సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌, కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

  • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
  • దసరా పండుగ వేళ సౌకర్యం
  • అటు నుంచి రాత్రి, ఇటు నుంచి పగలు ప్రయాణం

దసరా పండగ సందర్భంగా తమ తమ ఊళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్న ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన నగరాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైళ్లలో ఒకటి సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌కు, మరొకటి సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌కు అందుబాటులోకి రానున్నాయి.

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (నంబరు 07256) ఈ నెల 17వ తేదీ రాత్రి 7.20 గంటకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (నంబరు 07002) ఈ నెల 17వ తేదీ ఉదయం 5 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలు దేరుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. దసరా పండుగ ముందు రోజుల్లో రైల్వే శాఖ చేసిన ఈ ఏర్పాటు వల్ల ప్రయాణికులకు కొంత ఊరట అని చెప్పొచ్చు.

  • Loading...

More Telugu News