dk aruna: ఎన్నికల షెడ్యూల్ ను సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన డీకే అరుణ
- అరుణ తరపున పిటిషన్ దాఖలు చేసిన లాయర్ నిరూప్ రెడ్డి
- కేవలం కేబినెట్ నిర్ణయంతోనే అసెంబ్లీని రద్దు చేస్తారా? అంటూ ప్రశ్న
- సభకు సమాచారం కూడా ఇవ్వలేదంటూ ఆరోపణ
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైన నేపథ్యంలో... తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తరపున న్యాయవాది నిరూప్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. కేవలం కేబినెట్ నిర్ణయంతోనే అసెంబ్లీని రద్దు చేస్తారా? అని పిటిషన్ లో ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దుకు సంబంధించి సభకు సమాచారం కూడా ఇవ్వలేదని... 9 నెలల ముందుగానే సభను రద్దు చేయడం సభ్యుల హక్కులను కాలరాయడమేనని పిటిషన్ లో తెలిపారు.