dk aruna: కేబినెట్ తన పరిధిని దాటి వ్యవహరించింది.. గవర్నర్ ఆగమేఘాలపై ఆమోదించారు: డీకే అరుణ
- సభను రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్యేలకు కూడా చెప్పలేదు
- ఇది రాజ్యాంగ విరుద్ధం
- హైకోర్టులో పిటిషన్ వేసిన డీకే అరుణ
ఐదేళ్లు ఉండాల్సిన శాసనసభను రాజకీయ ప్రయోజనాల కోసం రద్దు చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. సభను రద్దు చేస్తున్నట్టు కనీసం ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో టీఎస్ కేబినెట్ తన పరిధికి మించి వ్యవహరించిందని... గవర్నర్ నరసింహన్ కూడా రద్దును ఆగమేఘాల మీద ఆమోదించారని విమర్శించారు. శాసనసభ రద్దును సవాలు చేస్తూ, సభ రద్దు రాజ్యంగబద్ధంగా జరగలేదని ఆరోపిస్తూ హైకోర్టులో ఈరోజు ఆమె పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.