Pavan kalyan: లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడు!: పవన్ కల్యాణ్
- విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా?
- కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖ
- గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్‌లు కావాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. 'విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా?.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా?' అంటూ పవన్ నిలదీశారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడం లేదని, అధికారంలోకి వస్తే జగన్‌కు సంబంధించిన దోపిడీ వ్యవస్థను తీసుకురాబోమని స్పష్టం చేశారు. జనసేనకు భయపడే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని దుయ్యబట్టారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుందనే భయం ప్రభుత్వానికి ఉందన్నారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్‌లు కావాలని అన్నారు.