ananth: ఎన్టీఆర్ సినిమాకి పోటీగా అప్పుడు మా అన్నయ్య సినిమా వచ్చింది: రాజబాబు సోదరులు
- మొత్తం 562 సినిమాలు చేశారు
- 275 సినిమాలు 200 రోజులు ఆడాయి
- లక్షకి పైగా పారితోషికం తీసుకున్నారు
తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన కమెడియన్ గా రాజబాబు కనిపిస్తారు. ఆయన తమ్ముళ్లుగా చిట్టిబాబు .. అనంత్ ఇద్దరూ కూడా కమెడియన్స్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి ఈ ఇద్దరు సోదరులు తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, అనేక విషయాలను పంచుకున్నారు.
"రాజబాబు 4 షిఫ్టులు పనిచేసేవారు. లంచ్ టైమ్ లో కూడా ఆయన అదే స్టూడియోలో ఆ పక్కనే జరుగుతోన్న షూటింగుకి వెళ్లి ఒక సీన్ చేసి వచ్చేవారు. అలా తన కెరియర్ మొత్తంలో ఆయన 562 సినిమాలు చేశారు. వాటిలో 275 సినిమాలు 200 రోజులు ఆడటం విశేషం. రాజబాబు హీరోగా 'పిచ్చోడి పెళ్లి' రూపొందింది. ఆ సినిమాకి రాజబాబు తీసుకున్న పారితోషికం లక్షా ఒక్క రూపాయి. ఎన్టీ రామారావుగారి 'సర్కస్ రాముడు' సినిమాకి పోటీగా ఈ సినిమా విడుదలై 100 రోజులు ఆడేసింది" అని చెప్పుకొచ్చారు.