Donald Trump: నిక్కీ హేలీ పోస్టుకు ఇవాంకా సరైన చాయిస్ అంటున్న ట్రంప్!

  • ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ
  • ముందస్తు సంకేతాలు లేకుండా రాజీనామా
  • ఆ పోస్టుకు ఇవాంకాకు అర్హత ఉందన్న ట్రంప్

ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఖాళీ చేసిన పోస్టుకు తన కుమార్తె ఇవాంకా ట్రంప్ సరైన చాయిస్ అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, 'నిక్కీ తరువాత అటువంటి డైనమిక్ పోస్టుకు ఇవాంకాకు అర్హత ఉందని భావిస్తున్నాను. అయితే, నేను ఆ పని చేస్తే, నాకు బంధుప్రీతని ఆరోపణలు వస్తాయి' అన్నారు.

కాగా, దక్షిణ కరోలినాకు గతంలో గవర్నర్ గా పనిచేసిన నిక్కీ, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే రాజీనామా చేసి వుండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక తన తండ్రి నోటి నుంచి వచ్చిన మాటలను ఇవాంకా ఖండించారు. ప్రస్తుతం తాను శ్వేత సౌధంలో గొప్పవారితో కలసి పని చేస్తున్నానని, నిక్కీ చాలా గొప్ప వ్యక్తని ఆమె అభివర్ణించారు. ఆమె స్థానంలో మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పిన ఆమె, అది తాను మాత్రం కాదని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News