sensex: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ కు 461.42 పాయింట్లు, నిఫ్టీకి 159.05 పాయింట్ల లాభాలు
- లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ సంస్థల షేర్లు
- భారతి ఇన్ ఫ్రాటెల్, టీసీఎన్ సంస్థల షేర్లకు నష్టాలు
నిన్న నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 461.42 పాయింట్లు లాభపడి 34760.89 వద్ద, నిఫ్టీ 159.05 పాయింట్ల లాభంతో 10,460.10 పాయింట్ల వద్ద ముగిశాయి. రూపాయి బలపడడం, ఆటో, బ్యాంకింగ్ తదితర రంగాల షేర్లు లాభాలను నమోదు చేయడం, ఈ నెల 11న రిజర్వ్ బాంక్ ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, జీ ఎంటర్ టైన్ తదితర సంస్థల షేర్లు లాభపడగా, భారతి ఇన్ ఫ్రాటెల్, టీసీఎన్, విప్రో, హెచ్ సీఎల్ టెక్ మొదలైన సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 గా ఉంది.