Sri Lanka: శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ నా నడుముపై చేతులు వేయబోయాడు.. అసభ్యంగా ప్రవర్తించాడు: ఎయిర్ హోస్టెస్

  • హోటల్‌లో దిగిన క్రికెటర్లను కలిసే ప్రయత్నం
  • ఎయిర్ హోస్టస్‌తో రణతుంగ అసభ్య ప్రవర్తన
  • మాకు సంబంధం లేదన్న హోటల్ యాజమాన్యం

దేశాన్ని ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం కుదిపేస్తోంది. పలు రంగాల్లో వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా బయటకొస్తూ ఇన్నాళ్లు గుండెల్లోనే దాచుకున్న భయంకర అనుభవాలను బయటపెడుతున్నారు. సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను బయపెడుతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ ఎయిర్ హోస్టస్ శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రస్తుతం దేశ పెట్రోలియం శాఖా మంత్రిగా ఉన్న అర్జున రణతుంగ చేతిలో ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే...

‘‘అప్పట్లో ఓ మ్యాచ్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్లు ముంబై చేరుకున్నాయి. జుహు సెంటార్ హోటల్లో బస చేశాయి. నా సహచర ఉద్యోగి వచ్చి క్రికెటర్లతో ఆటోగ్రాఫ్ తీసుకుందామని అడిగింది. సరేనని ఇద్దరం తొలుత శ్రీలంక క్రికెటర్లు ఉండే గదిలోకి వెళ్లాం. లోపల ఏడుగురు క్రికెటర్లు ఉన్నారు. మేం ఇద్దరమే. నాకు భయం వేసింది. ఇబ్బందిగా అనిపించడంతో వెనక్కి వెళ్లిపోదామని స్నేహితురాలితో చెప్పా. అంతలోనే వారు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. నేను తాగలేదు. అంతలోనే మరికొందరు మమ్మల్ని హోటల్ వెనకవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లారు.  

అక్కడ కెప్టెన్ రణతుంగ ఉన్నాడు. నాపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నడుము మీద చేయ వేయబోతే తప్పించుకున్నా. దీంతో నన్ను కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి పాస్‌పోర్టు రద్దు చేయిస్తానని హెచ్చరించి నేరుగా హోటల్ రిసెప్షన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశా. వారు మరింత దారుణంగా ప్రవర్తించారు. ఇది మీ ఇద్దరి మధ్య గొడవని, తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. తాము ఏ రకంగానూ సాయం చేయలేమని తేల్చి చెప్పారు’’ అని బాధిత ఎయిర్ హోస్టస్ పేర్కొంది. కాగా, ఆమె ఆరోపణలపై రణతుంగ ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News