Rahul Gandhi: మోదీ పేరెత్తలేదు, 15 లక్షలు వేస్తామనలేదు: మాటమార్చిన నితిన్ గడ్కరీ

  • రాహుల్ గాంధీకి మరాఠీ ఎలా అర్థమైంది?
  • ఆయన మరాఠీ ఎప్పుడు నేర్చుకున్నారు?
  • తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న గడ్కరీ

2014 పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చామని, ప్రజలు ఇప్పుడు వాటిని గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక పారిపోతున్నామని వ్యాఖ్యానించి ఎన్డీయే సర్కారును ఇరుకున పెట్టిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాటమార్చారు. తాను మరాఠీలో ఇచ్చిన ఇంటర్వ్యూను అర్థం చేసుకుని విమర్శలు చేయడానికి రాహుల్ మరాఠీ భాషను ఎప్పుడు నేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ ఇంటర్వ్యూలో తాను మోదీ పేరెత్తలేదని, ప్రజల ఖాతాల్లో ఎన్నడూ రూ. 15 లక్షలు వేస్తామని చెప్పలేదని ఆయన అన్నారు. తాను చెప్పింది ఒకటైతే, మీడియాలో ప్రసారమైంది మరొకటని వివరణ ఇచ్చారు.

తన మరాఠీ ఇంటర్వ్యూపై మరింత వివరణ ఇచ్చిన గడ్కరీ, ఏడెనిమిది రోజుల క్రితం తాను ఇంటర్వ్యూ కోసం వెళ్లానని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్, గోపీనాథ్ ముండే ఇచ్చిన ఎన్నికల హామీల గురించిన ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో అమలుకు సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇవ్వవద్దని తాను అభ్యంతరం చెప్పానని, అటువంటి హామీల జోలికి వెళ్లవద్దని తాను వారిద్దరికీ సూచించిన విషయాన్ని గుర్తు చేశానని గడ్కరీ అన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.

  • Loading...

More Telugu News