Rafele: రాఫెల్ డీల్‌లో రిలయన్స్‌ను తప్పనిసరి భాగస్వామిగా చేర్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం.. కీలక ఆధారాలను బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా!

  • రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాల్సిందేనని నిబంధన
  • ఆధారాలు బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా
  • కాంగ్రెస్‌కు కొత్త అస్త్రం

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు బలం చేకూర్చేలా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ‘డీల్’లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవడం తప్పనిసరి అంటూ ప్రభుత్వం పెట్టిన నిబంధనకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఆన్‌లైన్ పరిశోధనాత్మక పత్రిక ‘మీడియా పార్ట్’ బయటపెట్టింది.

రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమేనంటూ ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు బాంబు పేల్చారు. అయితే, రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నది తమ సొంత నిర్ణయమేనంటూ డసో ఏవియేషన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్‌ను తప్పనిసరిగా భాగస్వామిగా చేర్చుకోవాలంటూ  ప్రభుత్వం పెట్టిన నిబంధనకు సంబంధించిన ఆధారాలు బయపటడడంతో మరోమారు కలకలం రేగింది. రాఫెల్ డీల్‌పై ఇప్పటికే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మరో అస్త్రం చిక్కింది.

  • Loading...

More Telugu News