Metoo: 8 ఏళ్ల వయసులోనే వైరముత్తు నన్ను లైంగిక వేధింపులకు గురిచేశారు: గాయని చిన్మయి సంచలన ఆరోపణ

  • దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న 'మీటూ' ఉద్యమం
  • తన భర్త నుంచి మద్దతు లభించబట్టే బయటకు వచ్చానన్న చిన్మయి
  • స్విట్జర్లాండ్ లో వైరముత్తు లైంగికంగా వేధించాడని ఆరోపణ

'మీటూ' ఉద్యమం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ, ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన గాయని చిన్మయి, మరోమారు తన అభిప్రాయాలను, తనకెదురైన అనుభవాలను పంచుకుంది. తాజాగా ఓ వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనకు ఎంతో మంది నుంచి లైంగిక వేధింపుల సమాచారం అందుతోందని చెప్పిన ఆమె, వేధింపులను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తనతో పాటు ఉన్న ఎంతో మంది సింగర్స్ కు వైరముత్తు నుంచి వేధింపులు ఎదురయ్యాయని, తనకు తన భర్త నుంచి మద్దతు లభించబట్టే, తాను బయటకు వచ్చానని వెల్లడించింది. మిగతావారికి ఇంటి నుంచి, వారివారి భర్తల నుంచి సపోర్ట్ లభిస్తే, వారు తమ పేర్లను బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పింది.

ఇది అమ్మాయిల సమస్య కాదని, లైంగిక వేధింపులకు పాల్పడేవారు భయపడాల్సిందేనని, వారిని చట్టం ముందు నిలపాల్సిందేనని అభిప్రాయపడింది. తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినేనని వెల్లడించింది. ఘటన జరిగిన తరువాత చాలా సంవత్సరాలకు విషయం బయట పెడుతున్నారని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తనకు ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టే, బయటకు వచ్చానని చెప్పింది. తనకు ఎనిమిదేళ్ల వయసులోనే బ్యాడ్ టచ్ గురించి తెలిసిందని, సింగర్ గా ఎదుగుతున్న క్రమంలో స్విట్జర్లాండ్ కు ఓ ప్రదర్శనకు వెళ్లిన వేళ తనను వైరముత్తు లైంగికంగా వేధించాడని చెప్పింది.

  • Loading...

More Telugu News