India: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... తొలిసారిగా బరిలోకి దిగిన శార్థూల్ ఠాకూర్
- ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన మ్యాచ్
- ఇక్కడా రాజ్ కోట్ ఫలితాన్ని పునరావృతం చేస్తామన్న కోహ్లీ
- నిలకడగా సాగుతున్న విండీస్ బ్యాటింగ్
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్ట్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో టాస్ ఓడిపోవడం తమకేమీ ఇబ్బంది కాదని, రాజ్ కోట్ లో జరిగిన ఫలితమే ఇక్కడా కనిపిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పాడు.
కాగా, ఈ మ్యాచ్ తో భారత్ తరఫున యువ బౌలర్ శార్దుల్ ఠాకుర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కీమర్ రోచ్, లూయిస్ స్థానాల్లో కీమోపాల్, వారికాన్ లు వచ్చి చేరారు. బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. జట్టు స్కోరు నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు.