sensex: ఐటీ మినహా ఇతర రంగాల అండ.. దూసుకుపోయిన మార్కెట్లు
- 732 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- అమెరికా డాలరుతో పోలిస్తే బలపడిన రూపాయి విలువ
- ఐటీ స్టాకులపై ప్రభావం చూపిన రూపాయి
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు దూసుకుపోయాయి. ఐటీ రంగం మినహా ఇతర రంగాల స్టాకులు లాభాలను మూటగట్టుకున్నాయి. అమెరికా డాలరు మారకంతో రూపాయి విలువ బలపడటంతో ఐటీ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 732 పాయింట్లు లాభపడి 34,734కు పెరిగింది. నిఫ్టీ 238 పాయింట్లు పెరిగి 10,473కు ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సద్భావ్ ఇంజినీరింగ్ (17.89%), నవకార్ కార్పొరేషన్ (14.10%), జై కార్ప్ (13.47%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (11.58%), టాటా పవర్ (10.43%).
టాప్ లూజర్స్:
గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-5.06%), క్వాలిటీ (-4.99%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-4.42%), టీసీఎస్ (-3.10%), జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.93%).