paruchuri: 'ఠాగూర్' తమిళంలో కంటే తెలుగులో పెద్దహిట్: పరుచూరి గోపాలకృష్ణ
- 'కొడితే కొట్టాలిరా' పాట తమిళంలో లేదు
- శ్రియ .. సునీల్ పాత్రలలో మార్పులు చేశాము
- రమాప్రభ .. ఎమ్మెస్ పాత్రలను సృష్టించాం
ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ 'ఠాగూర్' సినిమాను గురించి మాట్లాడారు. 'ఠాగూర్' సినిమా తమిళంలో హిట్ అయింది .. కానీ తమిళంలో కంటే తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే ఈ సినిమాలో గ్లామర్ .. గ్రామర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి. తెలుగులో ఈ కథలో కొన్ని మార్పులు .. చేర్పులు చేశాము.
'కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి' పాట ఒరిజినల్లో లేదు. తెలుగులో ఈ పాటతోనే ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయ్యారు. తమిళంలో సునీల్ పాత్ర చాలా చిన్నది .. సాధారణంగా వుంటుంది. అలాంటి సునీల్ పాత్రను తెలుగులో పెంచేసి విపరీతమైన కామెడీని నడిపించడం జరిగింది. ఒరిజినల్లో శ్రియ పాత్ర కూడా తెలుగులో మాదిరిగా ఉండదు. డ్యూయెట్లు ఇవన్నీ కూడా తెలుగులో పెట్టినవే. రమాప్రభ .. ఎమ్మెస్ నారాయణ పాత్రలు కూడా ఒరిజినల్లో లేవు. ఇలా కథలో ఎన్నో జనరంజకమైన మార్పులు చేశాము అని చెప్పుకొచ్చారు.