Harish Rao: లాలూ ప్రసాద్ పార్టీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది: హరీష్ రావు

  • ఆర్జేడీపై బీహార్ పార్టీ అనే ముద్రను జార్ఖండ్ ప్రజలు వేశారు
  • టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడింది
  • ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్ ముసుగులో టీడీపీ యత్నిస్తోంది

తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందని చెప్పారు. జార్ఖండ్ ప్రజలు ఆర్జేడీని బీహార్ పార్టీగా ముద్ర వేసేశారని అన్నారు. అదే విధంగా టీడీపీపై కూడా ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడిందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతయిందని... తెలంగాణలో మళ్లీ ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ ముసుగులో టీడీపీ యత్నిస్తోందని ఎద్దేవా చేవారు.

నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు చంద్రబాబు పరిస్థితి ఉందని హరీష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వస్తే నాగార్జునసాగర్ పై 45 టీఎంసీల హక్కును తెలంగాణకు కల్పించబడుతుందని బచావత్ ట్రైబ్యునల్ తెలిపిందని... దీనికి కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అందుకే చంద్రబాబును ఆంధ్రా బాబు అంటున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News