KTR: వాళ్ల మీద ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబుకు భయమెందుకు?: మంత్రి కేటీఆర్

  • ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకెందుకు ఉలుకు?
  • చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కీలుబొమ్మలు
  • దసరా తర్వాత మా మేనిఫెస్టో ప్రకటిస్తాం

ఏపీలో సీఎం రమేశ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి నివాసాలపై ఐటీ దాడులు జరిగితే సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీ- కాంగ్రెస్ నేత రేవంత్ ఇంట్లో సోదాలు జరిగితే చంద్రబాబుకు సంబంధమేమిటని, ఐటీ దాడులు జరుగుతుంటే బాబుకు ఏదో భయముందని ఆరోపించారు.

చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కీలుబొమ్మల్లా మారుతున్నారని విమర్శించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు రూ.500 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారని, ఏపీ ఇంటెలిజెన్స్ ను తెలంగాణ రాష్ట్రంలో దింపారని ఆరోపించారు. ఈ సందర్భంగా తమ ఎన్నికల ప్రచార సభల గురించి, మేనిఫెస్టో గురించి కేటీఆర్ ప్రస్తావించారు. దసరా తర్వాత తమ మేనిఫెస్టోను ప్రకటిస్తామని, కేసీఆర్ ప్రచారం ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News