Ashok Babu: సీపీఎస్ రద్దుకు కమిటీ వేస్తే ప్రభుత్వాన్ని నమ్ముతాం: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు
- ఉద్యోగులు ఓటు బ్యాంకు కాదు
- కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
- సీపీఎస్ విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
సీపీఎస్ విధానం రద్దుకు డైరెక్ట్‌గా కమిటీ వేస్తే ప్రభుత్వాన్ని నమ్ముతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సీపీఎస్ విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి ఉద్యోగులు ఓటు బ్యాంకు కాదన్నారు. ఈనెల 23న ఛలో గుంటూరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ విధానం అంటే బానిసత్వానికి తెల్లచొక్కా వేసినట్లేనని అశోక్‌బాబు అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి రాజకీయ నిర్ణయాలు అవసరం అని అశోక్ బాబు అన్నారు.