Jagan: ఆరోగ్యం ఎలా ఉందన్నా?: మాజీ ఎమ్మెల్యేతో జగన్!

  • ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర
  • గజపతినగరం శివారులో జగన్ క్యాంప్
  • సీనియర్ నేత పెన్మత్సతో కలసి వచ్చిన తాడ్డి సన్యాసప్పలనాయుడు

ప్రస్తుతం తన పాదయాత్రలో భాగంగా, విజయనగరం జిల్లా గజపతినగరం శివారులో ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిసిన వేళ, జగన్ ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు."నీ ఆరోగ్యం ఎలా ఉందన్నా?" అని కుశలమడిగిన జగన్, ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

 తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని, వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ విధేయులుగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు, తాడ్డిని జగన్ విశ్రాంతి తీసుకుంటున్న శిబిరానికి తీసుకువచ్చారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో తాడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

  • Loading...

More Telugu News