vaira muttu: 'లై డిటెక్టర్' పరీక్ష నిర్వహించాలన్న కామెంట్ పై స్పందించిన చిన్మయి శ్రీపాద!
- వైరముత్తుకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలంటూ ట్వీట్
- ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్ కామెంట్స్
- ఆ కామెంట్స్ కు దీటుగా బదులిచ్చిన చిన్మయి
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ రచయిత వైరముత్తుకు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని అభిప్రాయపడుతూ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్వీట్ లో పేర్కొంది. అయితే, ఈ ట్వీట్ పై స్పందించిన ఓ నెటిజన్, వైరముత్తు కంటే ముందుగా చిన్మయి శ్రీపాదకు నిర్వహించాలని కామెంట్ చేశారు.
ఈ నెటిజన్ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘కచ్చితంగా, నాకు ఆ ధైర్యం ఉంది, అతడికి ఉందా?’ అని ప్రశ్నించింది. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే వైరముత్తు తనపై లైంగిక దాడి చేశారని, ఓసారి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు తనను ఆయన హోటల్ గదికి రమ్మన్నారని చిన్మయి ఇటీవల ఆరోపణలు చేసింది.