maruthi rao: అమృత తండ్రి మారుతీరావుపై మరో రెండు కేసుల నమోదు

  • ప్రణయ్ బంధువులను పిలిపించుకుని బెదిరించిన మారుతీరావు
  • ప్రణయ్ కదలికల గురించి చెప్పాలంటూ ఒత్తిడి
  • చెప్పకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు
ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులుగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలను మిర్యాలగూడలోని కోర్టులో భారీ బందోబస్తు మధ్య పోలీసులు ప్రవేశపెట్టారు. హత్య కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న వీరిని మరో రెండు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ పై కోర్టుకు తీసుకొచ్చారు. ఈ కేసుల వివరాల్లోకి వెళ్తే, ప్రణయ్ బంధువులైన కోడిరెక్క అశోక్ ను ఆగస్టు 6న, ఎర్రమళ్ల దినేష్ ను ఆగస్టు 11న తమ కార్యాలయానికి పిలిపించుకుని మారుతీరావు, శ్రవణ్, కరీంలు బెదిరించారు.

ప్రణయ్ కదలికలను తమకు తెలియజేయాలని, వారి రిసెప్షన్ ను అడ్డుకోవాలని కోరారు. దీనికి అశోక్, దినేష్ లు తిరస్కరించగా... చంపుతామని బెదిరించారు. ఈ మేరకు అశోక్, దినేష్ లు పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులకు సంబంధించే నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిందితులకు ఈనెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 
maruthi rao
amrutha
pranay
miryalaguda

More Telugu News