srilekha: అన్నయ్యను చూసే మ్యూజిక్ డైరెక్టర్ ను అయ్యాను: శ్రీలేఖ
- అలా సంగీత దర్శకత్వం వైపు వెళ్లాను
- ఫస్టు ఛాన్స్ గా హీరో విజయ్ సినిమా చేశాను
- తెలుగులో తొలి అవకాశం దాసరిగారు ఇచ్చారు
చాలా చిన్నతనంలోనే గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలేఖ, ఆ తరువాత సంగీత దర్శకురాలిగా కూడా ఎంతో ప్రతిభను కనబరిచారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన వైనం గురించి చెప్పుకొచ్చారు. "మొదటి నుంచి కూడా నాకు సింగర్ అవ్వాలనే ఉండేది. మ్యూజిక్ డైరెక్ట్ కావాలనే ఆలోచనే వుండేది కాదు.
అప్పట్లో అన్నయ్య కీరవాణి .. సంగీత దర్శకులు చక్రవర్తిగారి దగ్గర పనిచేసేవారు. రోజూ అన్నయ్యను తీసుకెళ్లడానికి కార్లు వచ్చేవి. నా కోసం కూడా అలా కార్లు రావాలనే పట్టుదలతో నేను ట్యూన్లు కడుతుండటం .. అన్నయ్యకి వినిపిస్తుండటం చేసే దానిని. ఒకసారి తమిళ హీరో విజయ్ తండ్రిగారు చంద్రశేఖర్ .. నా ట్యూన్లు విని, తాను విజయ్ తో చేస్తోన్న సినిమాకి నాతో సంగీతం చేయించుకున్నారు. అప్పుడు నా వయసు కేవలం 12 యేళ్లు. ఆ తరువాత తెలుగులో 'నాన్నగారు' సినిమాతో దాసరిగారు ఛాన్స్ ఇచ్చారు. 'తాజ్ మహల్' సినిమా నుంచి ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.