sensex: వరుసగా మూడో రోజు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
- 297 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 72 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్ ను లాభాల్లో ముగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ.. మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. రియాల్టీ, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాకులు లాభాలను గడించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 297 పాయింట్లు పెరిగి 35,162కు ఎగబాకింది. నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 10,585కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సౌత్ ఇండియన్ బ్యాంక్ (16.11%), సెంచురీ ప్లైబోర్డ్స్ (15.85%), ఫ్యూచర్ రీటెయిల్ (13.81%), హెచ్ఈజీ లిమిటెడ్ (10.64%), ఫినొలెక్స్ కేబుల్స్ (10.15%).
టాప్ లూజర్స్:
నవకార్ కార్పొరేషన్ (-6.21%), టాటా కమ్యూనికేషన్స్ (-5.01%), క్వాలిటీ (-4.97%), వక్రాంగీ (-4.90%), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (-4.24%).