Kerala: శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పునకు కట్టుబడి ఉన్నాం: కేరళ సీఎం విజయన్

  • ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు
  • రివ్యూ పిటీషన్ దేవస్థానం ఇష్టానికి సంబంధించింది
  • ఇక్కడికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తాం

శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు కేరళ మంత్రి వర్గ సమావేశం అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శబరిమల ప్రస్తావన గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాదని ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు.

ఈ తీర్పును పున:సమీక్షించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం రివ్యూ పిటీషన్ వేయడంపై ఆయన్ని ప్రశ్నించగా.. అది దేవస్థానం ఇష్టాయిష్టాలకు సంబంధించిందని అన్నారు. ఈ తీర్పును అమలు పరిచేందుకు ముందుగా శబరిమల ఆలయ పురాతన సంప్రదాయాలు తెలిసిన వారితో ఓ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. శబరిమలకు వెళ్తున్న మహిళా జర్నలిస్టులను నీలక్కల్ వద్ద బస్సులో నుంచి దింపేసిన ఘటనపై విజయన్ స్పందిస్తూ.. ఇక్కడికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News