kcr: ఆసరా పింఛన్ వయో పరిమితి తగ్గిస్తాం: సీఎం కేసీఆర్
- వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తాం
- పింఛన్ ను రూ.1000 నుంచి రూ.2016 కు పెంచుతా
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి హామీలన్నీ అమలు
తెలంగాణలో ఆసరా పింఛన్ పొందేందుకు వృద్ధుల వయోపరిమితిని తగ్గిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆసరా పింఛన్ పొందేందుకు వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని, నెలా నెలా ఇచ్చే పింఛన్ ను రూ.1000 నుంచి రూ.2016 కు పెంచుతామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, వికలాంగులకు ఇచ్చే పింఛన్ రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతామని, రైతు సమన్వయ సమితిలకు గౌరవ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తమ హామీలన్నీ అమలు చేస్తామని, ఇది పాక్షిక మేనిఫెస్టో మాత్రమేనని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోను ఎన్నికల కమిషన్ కు కూడా అందజేస్తామని కేసీఆర్ చెప్పారు.