kcr: కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ మక్కీకి మక్కీ కాపీ కొట్టారు: ఉత్తమ్ విమర్శలు

  • మేము ’నిరుద్యోగ భృతి’ ఇస్తామంటేే తప్పుబట్టారు
  • మరి, ఇప్పుడు ఆ హామీ ఎలా ఇచ్చారు?
  • నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలు ఎందుకివ్వలేదు?

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలను సీఎం కేసీఆర్ ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ మక్కీకి మక్కీ కాపీ కొట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే నిరుద్యోగులకు ’నిరుద్యోగ భృతి’ ఇస్తామని హామీ ఇస్తే తప్పుబట్టిన కేసీఆర్, ఇప్పుడు ఆ హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో పన్నెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఒప్పుకున్నారని, మరి, నాలుగున్నరేళ్లుగా వారికి ఉద్యోగాలివ్వకుండా ఆయన ఏం చేశారని ప్రశ్నించారు.  

  • Loading...

More Telugu News