Jammu And Kashmir: కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపిన భద్రతా బలగాలు!

  • ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ దుర్మరణం
  • శ్రీనగర్ లోని ఫతేహ్ హడల్ లో ఘటన
  • ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు
జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనగర్ లో ఉన్న ఫతేహ్ హడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాల నుంచి భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయక్త బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి.

అయితే భద్రతా బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా, ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అమరుడయ్యాడు. ఈ ఘటనలో కొందరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన అధికారులు, విద్యాసంస్థలను మూసివేశారు.
Jammu And Kashmir
encounter
Police
security forces
srinagar
terrorists

More Telugu News