sabarimala: శబరిమల వివాదం: సంప్రదాయాలకే విలువ ఇస్తానన్న కుమారస్వామి
- ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉంది
- సంప్రదాయాలను ఉల్లంఘించాలని అనుకోవడం వల్లే ఘర్షణలు
- ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ అంశంపై స్పందించారు. ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ సంప్రదాయాలను ఉల్లంఘించాలని అనుకోవడం వల్లే ఘర్షణలు చోటు చేసుకున్నాయని చెప్పారు. తాను సంప్రదాయవాదులకే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.