sabarimala: శబరిమల సెక్స్ టూరిజంకు సంబంధించిన స్థానం కాదు: ట్రావెంకోర్ దేవస్వాం బోర్డు మాజీ అధ్యక్షుడు
- వీటన్నింటి వెనుక పక్కా అజెండా ఉంది
- పోలీసుల హస్తం కూడా ఉంది
- తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రయార్ గోపాలకృష్ణన్
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆలయంలో ప్రవేశించేందుకు పలువురు మహిళలు అక్కడకు వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెంకోర్ దేవస్వాం బోర్డు (టీడీబీ) మాజీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, వీటన్నింటి వెనుక ఒక పక్కా అజెండా ఉందని తెలిపారు. ఈ ప్రతిష్టంభన వెనుక పోలీసులు కూడా ఉన్నారని ఆరోపించారు. శబరిమల అనేది అయ్యప్ప స్వామి కొలువుండే పవిత్రమైన స్థలమని... సెక్స్ టూరిజం కోసం వచ్చే స్థలం కాదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.