Vijayadashami: మైసూరు రాజ కుటుంబంలో పెను విషాదం.. ఒకే రోజు ఇద్దరు పెద్దల కన్నుమూత

  • రాజకుటుంబంలో విషాదం
  • ఉదయం పుట్ట చిన్నమ్మణ్ణి, సాయంత్రం విశాలాక్షి దేవి మృతి
  • ప్యాలెస్‌లో దసరా వేడుకలు రద్దు
మైసూరు మహారాజ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం  ఉదయం రాజమాత ప్రమోదాదేవి తల్లి పుట్ట చిన్నమ్మణ్ణి (98) కన్నుమూయగా, సాయంత్రం మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడయారు కుమార్తె (ప్రమోదాదేవి వదిన మరదలు) విశాలాక్షి దేవి (58) తుదిశ్వాస విడిచారు. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నమ్మణ్ణి  గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వయోభారం కారణంగానే ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో మైసూరు ప్యాలెస్‌లో విజయదశమి వేడుకలను రద్దు చేశారు.

విశాలాక్షి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం అందగానే రాజమాత ప్రమోదాదేవి ఆయుధ పూజను రద్దు చేసుకుని బెంగళూరు పయనమయ్యారు. ఆమె అక్కడ ఉండగానే తల్లి  పుట్ట చిన్నమ్మణ్ణి మృతి చెందినట్టు సమాచారం అందింది. దీంతో ఆమె వెంటనే బెంగళూరు నుంచి మైసూరు చేరుకున్నారు. చిన్నమ్మణ్ణి మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం తెలిపారు. పర్యాటక శాఖా మంత్రి మహేశ్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో రాజకుటుంబంలో విషాదం అలముకుంది. 
Vijayadashami
Mysore
Karnataka
Royals Wodeyar
Mysore kingdom
Pramoda Devi
Putta Chinnammanni
Vishakakshi Devi

More Telugu News