petro price down: మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధర తగ్గింది
- బాదుడు నుంచి వినియోగదారులకు స్వల్ప ఊరట
- ఢిల్లీలో పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 12 పైసలు తగ్గింపు
- అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
వరుసగా మూడో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారునికి ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గడంతో ఆ ప్రభావం భారతీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఈ రోజు ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 12 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.81.99, రూ.75.36గా నమోదయ్యాయి.
ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ దాదాపు ఇదే స్థాయలో ధర తగ్గింది. ఇక్కడ డీజిల్ ధర ఓ పైసా ఎక్కువ తగ్గగా, పెట్రోల్ ధర ఓ పైసా తక్కువ నమోదయింది. పెట్రోల్ ధర 38 పైసలు తగ్గి రూ.87.46కు చేరగా, డీజిల్ ధర 13 పైసలు తగ్గి 79 వద్ద కొనసాగుతోంది.