Cold: తెలంగాణలో క్రమంగా పంజా విసురుతున్న చలిపులి!

  • తెలంగాణలో చలిపులి పంజా
  • రంగారెడ్డి జిల్లాలో 15.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
  • రహదారులపై పొగమంచు

హైదరాబాద్ నగరం సహా, తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. గతవారం వరకూ ఉక్కిరిబిక్కిరి చేసిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు దారుణంగా పడిపోతున్నాయి. పగలు 33 నుంచి 35 డిగ్రీల వేడి నమోదవుతున్నా, రాత్రివేళల్లో 15.5 నుంచి 19.5 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతోంది. శివారు ప్రాంతాల్లో తెల్లవారుజామున మంచు కూడా కురుస్తోంది.

గత రాత్రి రంగారెడ్డి జిల్లా ఎదిరలో అత్యల్పంగా 15.5 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. కొందుర్గులో 15.8 డిగ్రీలు, చేవెళ్ల, కొత్తూరు ప్రాంతాల్లో 17 డిగ్రీలకు పడిపోయింది. రహదారులు పొగమంచుతో కప్పేయబడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో గతంలో అక్టోబర్ లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎన్నడూ నమోదు కాలేదని అధికారులు అంటున్నారు. సమీప భవిష్యత్తులో చలి మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News