MeToo India: ఆడవాళ్లు 'సెక్స్ సింబల్'... ఇంతవరకూ దేనికీ ఎవరినీ బలవంతంగా ఫోర్స్ చేయలేదు: రామ్ గోపాల్ వర్మ!

  • సాధించే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య భేదం లేదు
  • ఇంతవరకూ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు
  • స్త్రీకి ఉన్న మహాశక్తి ఆకర్షణే
  • మగవాళ్ల పొగరుతోనే 'మీటూ' ఉద్యమమన్న వర్మ

అందరు మగవాళ్లూ ఆడవాళ్లను 'సెక్స్ సింబల్'గా చూస్తారన్నది తన అభిప్రాయమని, తాను కూడా అంతేనని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఏదైనా సాధించాలంటే అందుకు స్త్రీ, పురుష సంబంధం ఉండదని చెప్పారు. తన జీవితంలో ఏ ఆర్టిస్టునూ కూడా దేనికీ ఫోర్స్ చేయలేదని, ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఆమెతో తప్పుగా ప్రవర్తించడం ఇంతవరకూ జరగలేదని అన్నారు.

 స్త్రీ తలచుకుంటే ఏమైనా సాధిస్తుందని, ఆ స్త్రీకి ఉన్న మహాశక్తి ఆకర్షణేనని, మగవాళ్లకు దాన్ని దేవుడు ఇవ్వలేదని అన్నారు. స్త్రీలు అందంగా ఉంటారు కాబట్టే తాను పొగుడుతానే తప్ప, వారిని కించపరచాలన్న ఉద్దేశంతో తన వ్యాఖ్యలు ఉండవని, వారిని తక్కువ దృష్టితో తాను చూడనని తెలిపారు. 'మీటూ' ఉద్యమాన్ని తాను లైంగిక వేధింపులు, అత్యాచారాలుగా భావించడం లేదని, మగవాళ్లు తమకున్న పొగరుతో, ఆడవాళ్లను తక్కువ చేసి చూస్తున్నందునే 'మీటూ' ఉద్యమం వచ్చిందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమం మంచిదేనని, దీని వల్ల పురుషులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారని అనుకుంటున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News