sabarimal: నేడు మూత పడనున్న శబరిమల

  • ఈరోజు రాత్రి 10 గంటలకు మూతపడనున్న ఆలయ ద్వారాలు
  • నవంబర్ మూడవ వారంలో మళ్లీ తెరుచుకోనున్న ఆలయం
  • గట్టి భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పును అనుసరించి పలువురు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే, ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారు వెనుదిగారు. అయినప్పటికీ శబరిమలలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఈ రోజు రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసుకోనున్నాయి.

ఐదు రోజుల పాటు నెలవారీ పూజలు నిర్వహించిన అర్చకులు ఆలయాన్ని మూసివేయనున్నారు. మళ్లీ నవంబర్ మూడవ వారంలో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈరోజు చివరి రోజు కావడంతో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. శబరిమల, పంబ బేస్, నీలక్కల్ ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

  • Loading...

More Telugu News