ys jagan: ఆ కుట్రలో భాగంగానే జగన్ పై దాడి జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది: మంత్రి కాలవ
- కత్తికి విషముంటుందని వైసీపీ అనుమాన పడింది
- విశాఖలోని ఆసుపత్రికి జగన్ ఎందుకు వెళ్లలేదు?
- తాపీగా విమానమెక్కి హైదరాబాద్ ఎందుకెళ్లారు?
ఏపీలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు దాడులు జరుగుతాయని హీరో శివాజీ నాడు చేసిన వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయని, ఆ కుట్రలో భాగంగానే ప్రాణహాని లేని దాడి జగన్ పై జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరిపై దాడి చేసినా తాము సహించమని అన్నారు. కేంద్ర భద్రతా సిబ్బంది అధీనంలో ఉండే విమానాశ్రయంలోనే ఈ దాడి జరిగిందని, ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే రాజకీయ కుట్రగా భావిస్తున్నామని అన్నారు.