nani: పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ .. హీరోగా నాని?

  • 'బ్రహ్మోత్సవం'తో పరాజయం 
  • తదుపరి ప్రాజెక్టు నానితో 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ కే ప్రాధాన్యత  

కెరియర్ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలకి పెద్దపీట వేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తరువాత ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విజయాన్ని సాధించిందిగానీ, 'బ్రహ్మోత్సవం' మాత్రం పరాజయం పాలైంది. దాంతో ఆయన మరో ప్రాజెక్టు సెట్ చేసుకోవడం కష్టమైపోయింది.

ఇటీవల ఆయన నానిని కలిసి ఒక కథను వినిపించాడనీ, కథాకథనాల్లో కొత్తదనం .. పాత్రల్లోని వైవిధ్యం కారణంగా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా కథ ఏమైవుంటుందనే ఆసక్తి తలెత్తుతోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అనేది తాజా సమాచారం. పల్లెటూరి యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపిస్తాడనీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే కథ నడుస్తుందని అంటున్నారు. 'జెర్సీ'తో పాటే నాని ఈ ప్రాజెక్టును కూడా చేస్తాడని చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News