hafiz saeed: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టులో ఊరట

  • హఫీజ్ స్థాపించిన సంస్థలపై నిషేధం చెల్లదు
  • ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో తీర్పు
  • వెల్లడించిన పాక్ మీడియా వర్గాలు

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ఊరట లభించింది. నిషేధం ఎదుర్కొంటున్న హఫీజ్ స్థాపించిన జమాద్ ఉద్ దవా, ఫలా ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ సంస్థలు నిషేధిత జాబితాలో ఉండబోవని పాకిస్తాన్‌లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ సంస్థల కార్యాకలాపాలు యథేచ్ఛగా కొనసాగనున్నాయి.

ప్రపంచ దేశాలు, అమెరికా ఒత్తిడితో పాక్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫిబ్రవరిలో ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం హఫీజ్‌కు చెందిన సంస్థలు నిషేధిత జాబితాలో చేరాయి. అయితే ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చలేదు. ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో సంస్థలపై ఉన్న నిషేధం చెల్లదని హఫీజ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో చట్ట పరిధిలో లేకపోవడంతో ఈ సంస్థలపై నిషేధం కొనసాగదని కోర్టు తీర్పునిచ్చిందని పాక్ మీడియా వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News