sensex: ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన దేశీయ మార్కెట్లు
- మరింత పతనమైన రూపాయి విలువ
- 340 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 10,030 వద్ద స్థిరపడిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. తద్వారా ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దాదాపు అన్ని సూచీలు నష్టాలను చవి చూశాయి. రూపాయి విలువ పతనంతో పాటు, అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడమే దీనికి కారణం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 340 పాయింట్లు పతనమై 33,349కి పడిపోయింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 10,030 వద్దకు జారిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డిష్ టీవీ ఇండియా (10.50), రేమండ్స్ (10.30), సియట్ (8.58), కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ (8.05), అదానీ పవర్ (7.58).
టాప్ లూజర్స్:
ఈక్విటాస్ హోల్డింగ్స్ (23.34), ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (17.62), యస్ బ్యాంక్ (8.97), గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (8.03), జెట్ ఎయిర్ వేస్ (5.28).