Petrol: వరుసగా పదో రోజూ... తగ్గిన పెట్రోలు ధరలు!
- తగ్గుతున్న ముడిచమురు ధరలు
- పెట్రోలుపై 40 పైసల ధర తగ్గింపు
- డీజిల్ పై 35 పైసలు తగ్గిన ధర
ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్న వేళ, డాలర్ మారకపు విలువలో రూపాయి బలపడుతూ ఉండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు దిగివస్తున్నాయి. వరుసగా పదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. శనివారం నాడు లీటరు పెట్రోలుపై 40 పైసలు, డీజిల్ పై 35 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 80.45, డీజిల్ ధర రూ. 74.38కు చేరుకున్నాయి. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 85.93, డీజిల్ ధర రూ. 77.96కు తగ్గాయి. విజయవాడలో పెట్రోలు రేటు రూ. 84.60, డీజిల్ రూ. 79.80కు చేరుకుంది. గుంటూరులో పెట్రోలు ధర రూ. 84.80కి, డీజిల్ రూ. 80కి తగ్గింది.