Karnataka: ఎంతకాలం బతుకుతానో చెప్పలేను: కర్ణాటక సీఎం కుమారస్వామి కంటతడి

  • మరోసారి కుమారస్వామి భావోద్వేగం
  • ఇజ్రాయిల్ లోనే చనిపోవాల్సింది
  • దేవుడే బతికించాడన్న కర్ణాటక సీఎం
మాండ్యా లోక్ సభ స్థానం ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వేళ, కర్ణాటక సీఎం కుమారస్వామి భావోద్వేగానికిలోనై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీసి, తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత, పలుమార్లు కంటతడి పెట్టిన ఆయన, తాజాగా మళపళ్లిలో జరిగిన బహిరంగ సభలోనూ అలానే మాట్లాడారు.

తాను గతంలో ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడే చనిపోయివుండాల్సిందని, కానీ దేవుడి దయతోనే బతికానని చెప్పిన కుమారస్వామి, ఇంకా ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో చెప్పలేనని అన్నారు. ఊపిరి ఉన్నంతకాలం ప్రజాసేవ చేస్తానని, జీవితాంతం పేదలకు అండగా ఉంటానని చెప్పారు. తన హృదయంలో ఎంతో భాధ ఉందని, దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలను తాను ఎన్నటికీ మరువబోనని చెప్పారు. కాగా, కుమారస్వామి ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Karnataka
Kumaraswami
Mandya
Bypolls

More Telugu News