Cricket: భారత్-వెస్టిండీస్ మూడో వన్డే.. రెండో వికెట్ కోల్పోయిన కరేబియన్ జట్టు!
- చావుదెబ్బ తీసిన బుమ్రా
- తొలి స్పెల్ లోనే రెండు వికెట్లు
- పోరాడుతున్న విండీస్ జట్టు
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మ్యాచ్ మొదలైన ఐదో ఓవర్లోనే సీమర్ జస్ ప్రీత్ బుమ్రా విండీస్ టాప్ ఆర్డర్ ను చావుదెబ్బ తీశాడు. కె.పావెల్ తో పాటు సి.హేమరాజ్ ను 8 ఓవర్లలోపే పెవిలియన్ కు పంపాడు. దీంతో 12 ఓవర్లకు 47 పరుగులు చేసిన విండీస్ జట్టు పోరాడుతోంది. ప్రస్తుతం హోప్(8), శామ్యూల్స్(2) క్రీజులో ఉన్నారు.
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో వన్డే జరుగుతోంది. ఈ సిరీస్ భాగంగా ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ ఓసారి గెలుపొందగా, రెండోది టైగా ముగిసింది. దీంతో ప్రస్తుతం ఈ వన్డే సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉంది. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు చోటు కల్పించిన సెలెక్టర్లు, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు.
భారత జట్టు: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ధోని, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్
వెస్టిండీస్ జట్టు: కీరన్ పావెల్, చంద్రపాల్ హేమరాజ్, సాయ్ హోప్, మార్లోన్ శామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అశ్లే నర్స్, కీమర్ రోచ్, మెక్కాయ్