raghu: ఎన్టీఆర్ ను తలచుకోని రోజు ఉండదు : కమెడియన్ రఘు
- మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం
- ఆయన సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది
- మా ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్సే
తనదైన మేనరిజంతో ప్రేక్షకులను నవ్వించే రఘు, ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాడు. ఒక రోజున ఐ మ్యాక్స్ థియేటర్ నుంచి బయటికి రాగానే అక్కడ ఎన్టీఆర్ ఫస్టు మూవీ 'నిన్నుచూడాలని' షూటింగు జరుగుతోంది. ఆ తరువాత రెండు సంవత్సరాలకే ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. రాజీవ్ కనకాల నన్ను ఎన్టీఆర్ కి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ నన్ను ఎంతగానో అభిమానిస్తారు.
ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం .. ఆయనను తలచుకోని రోజంటూ వుండదు. నా భార్య పిల్లలు కూడా నందమూరి అభిమానులే . బాలకృష్ణ .. ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ సినిమాలను వాళ్లు రిలీజ్ రోజే చూస్తారు. పిల్లల పుట్టినరోజున ఎన్టీఆర్ దగ్గరికి వాళ్లను తీసుకెళతాను. వాళ్లను ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. అలా ఎన్టీఆర్ తో పరిచయమైన దగ్గర నుంచి మా అనుబంధం కొనసాగుతూనే వుంది " అని చెప్పుకొచ్చాడు.