raghu: ఊహించని విధంగా గోదావరిలో పడిపోయాను: కమెడియన్ రఘు
- అది శ్రీకాంత్ 'దేవరాయ' షూటింగు
- గోదావరిలో బోట్ పై జరుగుతోంది
- ఒక్కసారిగా జారి పడిపోయాను
ఒక్కోసారి షూటింగ్స్ లో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జీవితంలో అప్పుడప్పుడు అవి గుర్తొచ్చి భయపెడుతూనే ఉంటాయి. తనకి కూడా అలాంటి సంఘటన ఒకటి ఎదురైందనే విషయాన్ని ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రఘు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ గారి 'దేవరాయ' సినిమా షూటింగ్ గోదావరిలో జరుగుతోంది. ఒక ఛాలెంజ్ సీన్లో భాగంగా నేను బోట్లో గోదావరిలోకి కొంచెం ముందుకు వెళ్లాలి.
అక్కడ లోతు తక్కువగానే ఉంటుందని చెప్పడంతో 'ఈత' రాకపోయినా ఓకే అనేశాను. కానీ బోట్లో నుంచి పట్టుతప్పి గోదావరిలో పడిపోయాను. గోదావరి పైకి ప్రశాంతంగానే వుంది కానీ .. ఒక మూడు అడుగుల లోతున వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా వుంది. ఆ ఫ్లోటింగ్ ఒక్కసారిగా నన్ను విసిరికొట్టింది. దాంతో నాకు తెలియకుండానే చేతికి దొరికింది పట్టుకున్నాను .. అది ఒక జాలరి కాలు. కింద అంత ఫ్లోటింగ్ ఉందని తెలియక అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లకి అసలు సంగతి చెప్పి .. నేను ఆ సీన్ చేయనని చెప్పేశాను' అన్నాడు.