Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సంచలనం.. బరిలోకి మూగ, బధిర అభ్యర్థి!
- సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఎన్నికల్లోకి సుదీప్
- మధ్యప్రదేశ్‌లో సంచనాలు సర్వసాధారణం
- సుదీప్ గెలిస్తే తొలి వ్యక్తిగా రికార్డు
సంచలనాలకు మారుపేరైన మధ్యప్రదేశ్ ఈ ఎన్నికల్లో మరోమారు సంచలనాలకు వేదిక కాబోతోంది. దేశంలోనే తొలిసారిగా మాట్లాడలేని, వినలేని (మూగ, బధిర) వ్యక్తి ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. దివ్యాంగులు, మూగ, బధిర యువతులపై జరుగుతున్న దారుణాలను చూసి చలించిపోయిన సుదీప్ శుక్లా అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేస్తున్న ఉద్యోగానికి టాటా చెప్పేసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పాడు. సత్నా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు తెలిపాడు.
మధ్యప్రదేశ్ లో గతంలో యమునా ప్రసాద్ శాస్త్రి అనే అంధుడు ఎంపీగా ఎంపికయ్యారు. అలాగే, ఓ థర్డ్ జెండర్ వ్యక్తి ఎమ్మెల్యేగా, మరో థర్డ్ జెండర్ మేయర్‌గా గెలిచారు. ఇప్పుడు సుదీప్ కూడా గెలిస్తే దేశ చరిత్రలోనే అసెంబ్లీకి ఎన్నికైన తొలి మూగ, బధిర వ్యక్తిగా రికార్డులకెక్కుతాడు. సుదీప్‌కు ప్రజల నుంచి మద్దతు కూడా బాగానే లభిస్తోంది.