Hyderabad: బీజేవైఎం జాతీయ సమరోహన్‌ సందర్భంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

  • అడిషనల్‌ సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌ కుమార్‌
  • వాహనాలు ప్రత్యేక మార్గాల్లో మళ్లింపు
  • ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయింపు

వాహన చోదకులు బీ అలెర్ట్‌. హైదరాబాద్‌ మహానగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. అందువల్ల ఎప్పటిలాగే మీ‘దారి’లో మీరు వెళితే అడ్డంకి ఎదురు కావచ్చేమో. అందువల్ల ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రెండు రోజు సమ్మేళనం సందర్భంగా నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అడిషనల్‌ సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌ కుమార్‌ తెలిపారు.

ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి బేగంపేటకు వచ్చే వారు  క్లాక్‌టవర్‌, ప్యాట్నీ సెంటర్‌, ఎస్‌డీ రోడ్‌ మీదుగా స్వీకార్‌ ఉపకార్‌, టివోలీ మీదుగా సీటీవో వైపు వెళ్లాలి. అటు నుంచి వచ్చే వారు సీటీవో నుంచి బాలంరాయి, తాడ్‌బండ్‌, తివోలీ, స్వీకార్‌ ఉపకార్‌ మీదుగా క్లాక్‌ టవర్‌ సంగీత్‌ జంక్షన్‌ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ప్యాట్నీ నుంచి వచ్చే వాహన చోదకులు క్లాక్‌టవర్‌ మీదుగా వెళ్లాలి. సమ్మేళనానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు కూడా కేటాయించారు.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి వచ్చేవారు పంజాగుట్ట, బేగంపేట, ట్యాంక్‌బండ్‌, ప్యారడైజ్‌, సీటీవోల మీదుగా కార్గో ఆఫీస్‌, వెస్లీ పీజీ కళాశాలలకు చేరుకుని వాహనాలు నిలపాలి. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం నుంచి వచ్చే వాహనాలను ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌, తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్‌ పరిసరాల్లో నిలపాలి. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను బోయినపల్లి మార్కెట్‌, దోబీఘాట్‌, బాలంరాయి ఈద్గా ప్రాంతాల్లో నిలపాలి.   

  • Loading...

More Telugu News